సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు.. బండి సంజయ్..

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారు…

నల్ల పిల్లితో ఫామ్ హౌస్ లో కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తాడని , అయితే ఆయన క్షుద్ర పూజలు ఫలించకుండా పోయే పరిస్థితి ఇప్పటికే వచ్చిందని సంజయ్ అన్నారు.దుబ్బాక హుజురాబాద్ లలో కెసిఆర్ తాంత్రిక పూజలు ఫలించలేదని ఎద్దేవా చేశారు.
తాను చెప్పేది జోక్ కాదని, వందశాతం వాస్తవం అంటూ బండి సంజయ్ తన విమర్శలను సమర్థించుకున్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ముగ్గురు వర్కర్లు మరణించారని ఆయన గుర్తుచేశారు. అంతకుముందు ఓ యువకుడు కూడా చనిపోయాడని, ఇది బలి కావొచ్చని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని బండి సంజయ్ చెప్పారు. ఇలాంటి పూజలన్నీ చేసిన తరువాతే కేసీఆర్ తన స్వార్థం కోసం టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాడని విమర్శించారు…

రాష్ట్ర సంక్షేమాన్ని ఏనాడో విస్మరించిన కేసీఆర్.. తాంత్రికుల సూచనలు మాత్రమే పాటిస్తున్నారన్నారు. ఏ జెండా, ఏ ఎజెండా లేకుండానే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని, సచివాలయానికి కూడా అందుకే వెళ్లడం లేదన్నారు. ఫామ్ హౌస్ లో కూడా తరచుగా అలాంటి పూజలే చేస్తారన్న సంజయ్ మునుగోడు బరిలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ గెలుపు ఖాయమైపోయిందన్నారు…