ఆగస్ట్ 2 నుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర. ..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్ట్ 2వ తేదీ నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించి వరంగల్ భద్రకాళీ ఆలయం వరకు యాత్ర కొనసాగించనున్నారు. సుమారు 26 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నారు. గతంలో రెండు పర్యాయాలు సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించారు.