టీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు కొమ్ముకాస్తూ లౌకిక వాదులని చెప్పుకోవడం సిగ్గు చేటు. బండి సంజయ్….

అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలపై సమర శంఖం పూరిస్తోంది. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడంతో వెయ్యి కోట్ల బకాయి ఉంది. నేడు రైతుల పొలాలకు కరెంట్ లేక ఎండబెడుతున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతానన్న ఎంఐఎం నేతలు చెప్పిండ్రు. ఇప్పుడు నేను చెబుతున్నా…. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాతబస్తీలో 15 నిమిషాలు విద్యుత్ సిబ్బందిని అప్పగిస్తాం. గల్లీగల్లీని జల్లెడ పట్టిస్తం. పాత బకాయిలతో సహా విద్యుత్ బిల్లులను వసూలు చేయిస్తాం. నేను నా దేశం, హిందూ ధర్మం కోసం బరాబర్ పనిచేస్తా అన్నారు బండి సంజయ్..బైంసాలో 12 మంది కార్యకర్తల ఇళ్ళను కొందరు లుచ్చాలు తగలబెడితే ఒక్క పైసా కూడా సాయం చేయని మూర్ఖపు ప్రభుత్వం కేసీఆర్ దే.. కానీ వాళ్లకు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటూ ఇళ్లు కట్టించింది. తెలంగాణలో హిందువులందరినీ ఓటు బ్యాంకుగా మార్చి హిందూ సమాజం దమ్ము చూపిస్తాం. ఎవడైతే మా అడ్డా అనుకుంటున్నడో పాతబస్తీకి రావాలంటే నా పర్మిషన్ తీసుకోవాలని ఎవరైతే సవాల్ విసిరిండో…. ఆ సవాల్ ను స్వీకరించి టైం, డేట్ చెప్పి పాతబస్తీ అడ్డాకు వెళ్లి సభ పెట్టి దమ్ము చూపిన పార్టీ బీజేపీ.బండి సంజయ్ మాట్లాడితే మతతత్వమని చెప్పే టీఆర్ఎస్ నేతలు ఎంఐఎంకు కొమ్ముకాస్తూ లౌకిక వాదులని చెప్పుకోవడం సిగ్గు చేటు. నేడు ప్రతి నోటా హిందువులమని సగర్వంగా చెప్పుకునేలా చేసిన ఘనత బీజేపీ కార్యకర్తలదే. కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేంది? ఏనాడైనా లాఠీ దెబ్బలు తిన్నదా? కేసులు ఎదుర్కొన్నదా? జైలుకు పోయిందా? కేసీఆర్ ఫాలనను చూసి అమరుల ఆత్మలు ఘోషిస్తున్నయ్.