ఒక సామాన్యుడు ప్రధాని అయ్యారంటే అది అంబేడ్కర్‌ భిక్షేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌..

R9TELUGUNEWS.COM.ఒక సామాన్యుడు ప్రధాని అయ్యారంటే అది అంబేడ్కర్‌ భిక్షేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. అంబేడ్కర్‌ను సగౌరవంగా సత్కరిస్తున్న ప్రభుత్వం తమదేనని తెలిపారు. రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ భాజపా భీమ్‌ దీక్షను చేపట్టారు. ‘‘అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వద్దని కేసీఆర్‌ అంటున్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయకపోవడానికి కారణం కూడా ఇదే. అంబేడ్కర్‌ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు’’ అని సంజయ్‌ అన్నారు.