ఉప ఎన్నిక ఫలితంపై బండి సంజయ్‌ అనుమానం..!!

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్.. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడంలేదన్నారు.
బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించని సీఈవో.. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు…