115 మందిలో సగం మందికి కేసీఆర్ బి ఫామ్ ఇవ్వరు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్..
కేసీఆర్ కుటుంబంలో ఒక్క కవితకు ప్రాధాన్యమిస్తే రాష్ట్రంలో 33 శాతం మహిళలందరికీ న్యాయం జరిగినట్లేన్న..!
కేసీఆర్ కుటుంబంలో ఒక్క కవితకు ప్రాధాన్యమిస్తే రాష్ట్రంలో 33 శాతం మహిళలందరికీ న్యాయం జరిగినట్లేనని ముఖ్యమంత్రి భావిస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
కేబినెట్లో ఏ మేరకు మహిళలకు స్థానం ఉందో.. మొన్న బీఆర్‌ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో ఎంతమంది మహిళలకు టికెట్ ప్రకటించారు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు..
BRS..119 సీట్ల గాను 115 మందికి ఎమ్మెల్యే సీటు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సగం మందికి టికెట్లు ఇవ్వరని
జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టికెట్స్క ప్రకటించిన సగం మందిలో అభ్యర్థులకు ఏదో సాకు చూపించి టికెట్ వెనక్కు తీసుకుంటారని ఆరోపించారు. పార్టీ కేడర్‌ను కాపాడుకోవడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. అందరూ బీజేపీలో చేరడానికి
రెడీగా ఉన్నారని సంజయ్ అన్నారు. సర్వేలన్నీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోతుందని చెబుతున్నాయని ముఖ్యమంత్రి తెలుసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కేవలం 25 సీట్లు మాత్రమే వస్తాయని మిగతా 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ డబ్బులు ఇచ్చి బరిలో ఉంచుతున్నారని ఆరోపించారు…