ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌పై కేసు నమోదు..

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ నెల 27 (బుధవారం) చెంగిచర్లలో జరిగిన ఘటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన బండి సంజయ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు..నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌తో పాటు మరో 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లింల దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న (బుధవారం) చెంగిచర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు. బండి సంజయ్ రావడంతో పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు గుమిగూడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమతి లేదంటూ తెలిపారు. ఎవరూ లోనికి అనుమతించకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాట్లు చేశారు.