సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు బిగ్ షాక్..!

*సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.* ఆయనకు *ఏడాది జైలుతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది.* చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి ఆయన నేడు హాజరయ్యారు. ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష, 95 లక్షలు జరిమానాను సెకండ్ ఏఎంఎం కోర్టు విధించింది. అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. *2019లో ముప్పాళ్ళ గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు వద్ద ఆయన రూ.95 లక్షలు తీసుకున్నారు.* పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో బండ్ల గణేష్ చెక్ ఇచ్చారు. చెక్ బౌన్స్ కావడంతో విచారించి కోర్టు బండ్ల గణేష్‌కు జైలు శిక్ష, జరిమానా విధించింది…