బంగాళాఖాతంలో ఉత్పాతం చోటు చేసుకుంది. పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత పొరుగునే ఉన్న పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా పడింది..కోల్‌కత సహా పలు నగరాల్లో భూమి ప్రకంపించింది. బంగ్లాదేశ్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. తీర ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. కెరటాలు ఉవ్వెత్తున ఎగిశాయి.
బంగాళాఖాతంలో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా రికార్డయింది. 19.52 ఉత్తర అక్షాంశం, 88.55 తూర్పు రేఖాంశం మధ్య ఈ తెల్లవారుజామున సరిగ్గా 6:10 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
కోల్‌కతకు నైరుతి దిశగా 109, ఒడిశాకు ఈశాన్య దిక్కున 175 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించింది. సముద్ర ఉపరితలం నుంచి 91 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సెస్మాలజీ సెంటర్ వివరించింది.
దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ తీరంపై పడింది. పలు ప్రాంతాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. అలలు పోటెత్తాయి. మత్స్యకార గ్రామాలు భయాందోళనలకు గురయ్యాయి. తొలుత- సునామీ సంభవింవచవచ్చంటూ వార్తలొచ్చాయి గానీ అలాంటి హెచ్చరికలేవీ కూడా జారీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ భూకంప తీవ్రత కోల్‌కతలో పలు ప్రాంతాల్లో కనిపించింది. పలుచోట్ల భూమి ప్రకంపించింది. దిఘా, మందార్‌మణి, హెన్రీ ఐలండ్స్, శంకర్పూర్, సాగర్ ఐలండ్స్, బక్ఖాలి, గోబర్ధన్‌పూర్ వంటి చోట్ల తీరం అల్లకల్లోలమైంది. కొన్ని చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కెరటాలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన సమాచారం ఇప్పటివరకు లేదు…