జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏ దౌర్జన్యం..ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి..!

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏ దౌర్జన్యం..

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు, ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్..
ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు…

జూబ్లీహిల్స్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ దౌర్జన్యానికి దిగాడు. అన్యాయంగా ఓ వ్యక్తిని దారుణంగా కొడుతూ అడ్డంగా దొరికిపోయాడు జూబ్లీహిల్స్ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పిఎ. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ( Maganti Gopinath ) అనుచరుడు, ప్రస్తుతం ఆయనకు పీఏగా విధులు నిర్వహిస్తున్న భాస్కర్.. ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది…. రక్తం కారుతున్న కానీ కనీసం వదిలిపెట్టకుండా అతను అనుచరులతో తీవ్ర స్థాయిలో దాడిగి దిగటం అధికార మదంతో అడ్డగోలుగా దాడి చేయడం చూసే ప్రతి ఒక్కరికి ఆవేదనకు గురి చేసింది..

అసలు ఆ వ్యక్తి ఏం చేశాడో తెలీదు కానీ.. పెద్ద కర్రతో అతన్ని దారుణంగా కొట్టాడు భాస్కర్. అతను కొట్టడమే కాకుండా.. తన అనుచరులతో కూడా కొట్టించాడు. ఎవరూ ఆపినా కూడా.. చితక్కొట్టారు. ఇక ఈ వీడియోను చూసిన వారు.. భాస్కర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ కార్యకర్తలు కూడా.. భాస్కర్ ను శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.