వణుకు పుట్టిస్తున్న బ‌ర్డ‌ఫ్లూ…

కేర‌ళ రాష్ట్రాన్ని బ‌ర్డ‌ఫ్లూ భ‌య‌పెడుతున్న‌ది. ఆ రాష్ట్రంలో బ‌ర్డ్ ఫ్లూ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. అల‌ప్పుజ జిల్లాలో కోళ్లు, బాతులు ఫ్లూ బారిన ప‌డుతున్నాయి. జిల్లాలోని త‌క‌ళి గ్రామ పంచాయ‌తీలో సుమారు 1200 బాతులు బ‌ర్డ్‌ప్లూ బారిన ప‌డ‌టంతో వాటిని అధికారులు ప‌ట్టుకొని చంపేశారు. అల‌ప్పుజ జిల్లాలో ఈ వ్యాధి వ్యాపిస్తుండ‌టంతో క‌లెక్ట‌ర్ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లూ ఇత‌ర ప్రాంతాల‌కు వ్యాపించ‌కుండా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు…ఫ్లూ అధికంగా ఉన్న త‌క‌ళి గ్రామంలోని ప‌దో వార్డును కంటైన్మెంట్‌జోన్ గా మార్చారు. త‌క‌ళి గ్రామ‌పంచాయితీలో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిషేధించారు. మాంసం దుకాణాల‌ను మూసేయించారు. చంపకుళం, నేడుముడి, ముత్తార్, వీయపురం, కరువట్ట, త్రిక్కున్నపుళ, తకళి, పురక్కాడ్, అంబలపుజ సౌత్, అంబలపుజ నార్త్, ఎడత్వ పంచాయతీలు, హరిప్పాడ్ ప్రాంతాల్లో ప్ర‌స్తుతం ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. ..