రచ్చరచ్చ చేసిన బర్రెలక్క..!!

రచ్చరచ్చ చేసిన బర్రెలక్క

ఓ యూట్యూబర్ తన పేరు చెడగొట్టాడంటూ బర్రెలక్క అలియాస్ శిరీష ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు అతడి యూట్యూబ్ స్టూడియోకు వెళ్లి నిలదీసింది. ..
క్రిందా విడియో లింక్ క్లిక్ చేసి చూడండి.

https://youtu.be/3eurk6_ivYw?si=oHkgtHEMKcf8dXge

తెలంగాణ రాజకీయాల్లో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల గొంతకుగా ఆమె కొల్లాపూర్ నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ఆమెకు యువత, పలువురు మేధావులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈసారి బర్రెలక్క విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు వచ్చిన స్పందన చూస్తే అలానే అనిపించింది…

ఎన్నికల సమయంలో తనపై జరిగిన దాడులకు సంబంధించి పలు వీడియోలు వైరల్ అయ్యాయి…

ఇందులో భాగంగా ఓ యూట్యూబర్ చేసిన వీడియో వల్ల తన పేరు చెడిపోయిందని.. ఆ వీడియో కారణంగానే తనకు ఓట్లు పడలేదని యూట్యూబర్‌తో బర్రెలక్క గొడవకు దిగిన వీడియో వైరల్ అవుతోంది….

ప్రధాన పార్టీ అభ్యర్థులకు చిక్కులు తప్పవని భావించారు. అయితే అనుహ్యంగా ఆమె ఓటమి పాలయ్యారు. ఆమెకు కేవలం 5 వేల ఓట్లు మాత్రమే పోలై.. డిపాజిట్ కోల్పోయారు. తనకు తక్కువ ఓట్లు రావటానికి ఓ యూట్యూబర్ కారణమంటూ తాజాగా బర్రెలక్క రెచ్చిపోయారు. సదరు యూట్యూబర్ స్టూడియోకు వెళ్లి నానా రచ్చ చేశారు. అతడిపై గట్టిగా అరుస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు…