బాసర ట్రిపుల్ ఐటీకి…సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు..!!.
బాసర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సాయంత్రం బయల్దేరారు…
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువదలని భట్టీవిక్రమార్కుల్లా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఎండనక, వాననక తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒకరోజుకాదు రెండు రోజులు కాదు ఏడురోజులుగా ఆందోళన కార్యక్రమాలతో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శకు వచ్చినపుడు తమగోడును వెల్లబోసుకున్నారు. న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను కల్పించాలని వేడుకున్నారు. చర్చలు, ఉత్తుత్తి హామీలు వద్దని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి మౌలిక వసతుల్లేకుండా క్లాసులు ఎలా వినాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు…
దీంతో తెలంగాణ రాష్ట్రం తరుపున విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఉన్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత ఏడు రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం క్యాంపస్ విద్యార్థులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు నిర్వహించారు…