బాసరలో విద్యార్థుల ధర్నా….!!!

నిర్మల్ జిల్లా బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ త్రిబుల్ ఐటీ లో నాణ్యత కలిగిన ఆహారం అందించడం లేదని విద్యార్థులు భారీ ధర్నా చేపట్టారు… ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు చెప్పిన కానీ పట్టించుకోవడంలేదని నాణ్యత లోపం ఉన్న ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్లు విద్యార్థులు తెలిపారు.. తమకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపిన అంతవరకు ధర్నా కొనసాగిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు..