ఈరోజు నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం… బతుకమ్మ పండుగ ప్రత్యేక కథనం..

ఈరోజు నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం..

దేవీనవరాత్రులలో ప్రధానమైనది శక్తిపూజ !! సరస్వతీ పూజ..తెలంగాణా రాష్ట్రంలో ప్రధానంగా శక్తిని “బతుకమ్మ”గా ఆరాధిస్తున్నారు.

కాకతీయ సామ్రాజ్యం పరిఢవిల్లిన కాలంలో “బతుకమ్మ” సంబరాలు సామ్రాజ్యమంతటా ఘనంగా నిర్వహించడం చరిత్ర!! శక్తిపూజ అనాదిగా కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయం. తెలంగాణాలో ఈ సంప్రదాయం మరింత ప్రముఖంగా ప్రస్ఫుటిస్తోంది.

భాద్రపద అమావాస్య నాడు మొదలయ్యే ఈ తొమ్మిది రోజుల పండుగ ఆశ్వయుజ శుద్ధఅష్టమి రోజున, దుర్గాష్టమి రోజున పరిసమాప్తి అవుతోంది. బతుకమ్మ పండుగ శరత్ ఋతువు ఆగమనానికి సూచకం.

“బతుకమ్మ” ఆదిశక్తీ, భూమాత, ప్రకృతి మాత, అందుకే ఆమె స్వరూపం వివిధ రకాల పువ్వులతో ఏర్పడుతోంది. ఈ పువ్వులు అందమైనవి, పరిమళభరితమైనవి… ఔషద స్వభావం కలవి. బతుకమ్మ ప్రాణదేవత, జీవన ప్రదాత, సర్వమంగళ అయిన మహాగౌరిదేవీ !!

సంప్రదాయం దుస్తులు ధరించిన బాలికలు, యువతలు, మహిళలు భక్తీ పూర్వకంగా “బతుకమ్మ”ను గురించి పాటలు పాడడం, నృత్యం చెయ్యడం ఈ ఉత్సవాలలోని ప్రధాన కార్యక్రమం.
మొదటి ఐదురోజుల పాటు “బతుకమ్మ” విగ్రహాన్ని గోమయం (ఆవు పేడ)తో రూపొందించి పూజిస్తారు. చివరి నాలుగు రోజులు వివిధ పుష్పాలతో “బతుకమ్మ”లను రూపొందిస్తారు. తొమ్మిది రోజులపాటు తొమ్మిది పేర్లతో “బతుకమ్మ”ను ఆరాధించడం శక్తిపూజలో భాగం.

ప్రతిరోజున ప్రత్యేకమైన నైవేద్యం సమర్పిస్తారు. “బతుకునిచ్చే” ఈ దేవిని ఆర్ధించడం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తాడని, వివాహితులకు మంచి సంతానం కలుగుతుందని, దీర్ఘసుమంగళిగా బతుకుతుందని విశ్వసించడం సంప్రదాయం.

అతి ప్రాచీనకాలంలో దక్షిణ భారతదేశాన్ని మొత్తం చోళ రాజులు పాలించేవారు. ధర్మాంగదుడు అన్న చోళ రాజు సంతానం కోసం మహాలక్ష్మీ రూపమైన ఆదిశక్తిని అర్చించాడు. లక్ష్మీదేవి స్వయంగా ధర్మాంగద దంపతులకు కుమార్తెగా జన్మించింది. చిన్నప్పుడే అనేక ప్రమాదాలకు గురి అయినప్పటికీ ఆ లక్ష్మీదేవి వాటిని అధిగమించింది. అందువల్ల ఆ “పాప” పేరు “బతుకుఅమ్మ”గా స్థిరపడింది.

అనాదిగా జరుగుతున్న “దేవీపూజ” అప్పటినుండి “బతుకమ్మ” పండుగగా ప్రసిద్ధికెక్కింది.

బతుకమ్మ పండుగ

దేవీనవరాత్రులలో ప్రధానమైనది శక్తిపూజ !! సరస్వతీ పూజ..
తెలంగాణా రాష్ట్రంలో ప్రధానంగా శక్తిని “బతుకమ్మ”గా ఆరాధిస్తున్నారు.