తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై మండిపడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

R9TELUGUNEWS.COM తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని.. సీఎం కేసీఆర్‌నని వెల్లడించారు. ఈ మేరకు కొత్త సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ‘‘ భాజపా కుట్రలకు కేసీఆర్‌ వంత పాడుతున్నారు. కేసీఆర్‌ది కేంద్రంతో కయ్యం కాదు.. ఉత్తుత్తి నాటకం. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఎన్నో ఏళ్లుగా భాజపా కుట్ర చేసింది.. ఇప్పుడు ఆ కుట్రలను ముందుకు తీసుకెళ్లేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయి’’ అన్నారు.