బండి సంజయ్ పై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్..

బండి సంజయ్ పై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్. ఎవరి కోసం సంజయ్ పాదయాత్ర. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నావా..? మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారం లోకి రావాలని పాదయాత్ర చేస్తున్నావా..? పేదల అకౌంట్స్ లోకి 15 లక్షలు వేయనందుకు పాదయాత్ర చేస్తావా..?..

దేశంలో ఉన్న అన్ని మతాలు, కులాలకు సమానత్వం కల్పించి జాతి నిర్మాణం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున మనువాదం పేరిట జాతిని విడగొట్టాలని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.