ఎస్ 4 బోగీ నుంచి ఎస్ 10 బోగీవరకు 7 బోగీ లు డ్యామేజ్ అయినట్లుగా గుర్తించిన అధికారులు…
ఆయిల్ లీకేజీ తో పాటు, ఆటో మేటిక్ బ్రేక్ కారణంగా పట్టాలు తప్పినట్లు తేల్చిన రైల్వే అధికారులు…
బిబినగర్ వద్ద గోదావరి రైల్ పట్టాలు తప్పి నిలిచి పోవడంతో,,పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం.
భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్లలో పలు రైళ్లు నిలిపివేత…..
…
డ్యామేజ్ అయిన బోగిలను బిబినగర్ వద్ద వదిలి మిగితా బోగిలతో సికింద్రాబాద్ బయలుదేరిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైల్….
సికింద్రాబాద్ ……..
*గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడం రైల్వే అధికారుల అత్యవసర సమావేశం..*
పట్టాలు తప్పడానికి గల కారణాలపై కాసేపట్లో అధికారిక ప్రకటన…
హెల్ప్ లైన్ నెంబర్ 040 – 2776644
పట్టాలు తప్పిన ఆరు భోగిలు S1 -S4 , ,జనరల్ బొగిలు ,slr బోగి…
మిగిలిన బొగిలను సికింద్రాబాద్ కి పంపామన్నా రైల్వే అధికారులు…
బీబీనగర్ ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారుల వెల్లడి..
నిలిచి పోయిన రైళ్ల వివరాలు….
………..
*-విశాఖ నుండి మహబూబ్నగర్ వెళ్లే స్పెషల్ ఎక్స్ప్రెస్ బీబీనగర్లో నిలిపివేత.*
*-ఆరు గూడ్స్ రైళ్లను బోనగిరి-బీబీనగర్ మధ్యన నిలిపివేయడం జరిగింది.*
*-సికింద్రాబాద్కు వెళ్లే కాకతీయ ఎక్స్ప్రెస్ ఆలేరు జనగామ జిల్లా నిలిపివేత.*
*-వంగపల్లిలో మరో రెండు గూడ్స్ రైళ్లను నిలిపివేయడం జరిగింది..*
*బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ పూర్తి వివరాలు*
గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ సమీపంలో ట్రైన్ పట్టాలు తప్పింది. మొత్తం 4 బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఊహించని ఘటనతో రైలులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్ వెంటనే ట్రైన్‌ను నిలిపివేశాడు. దీంతో ప్రయాణికులంతా రైలులోంచి కిందకు దిగేశారు.ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. కిందపడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు వెల్లడించారు. ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.