నేటి నుంచి బిసీ కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను పంపిణీ..

15 నుంచి రూ.లక్ష ఆర్థికసాయం.

*బిసీ కుల వృత్తుల వారికి ఈ నెల 15 నుంచి రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు..

కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థికసాయం పథకం
రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌
కలెక్టర్లు, అధికారులతో వీసీ
ఎదులాపురం, జూలై 13 : బీసీ కుల వృత్తుల వారికి ఈ నెల 15 నుంచి రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులకు ఆర్థికసాయం పథకం అమలుపై గురువారం బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి బుర్ర వెంకటేశంతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మట్లాడుతూ.. బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులను సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని తెలిపారు.

కుల, చేతి వృత్తులు చేసుకునే వారికి ప్రోత్సాహం అందిస్తే ఆర్థికంగా ఎదుగుతారనే ఉద్దేశంతో రూ.లక్ష గ్రాంట్‌ అందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించి తెలిపారు. జూన్‌ 9న దీన్ని లాంఛనంగా ప్రారంభించారుని గుర్తుచేశారు. జూన్‌ 20 వరకు బీసీ కుల వృత్తులకు ఆర్థిక సాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు స్వీకరించామని, వీటిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సహాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 15 నుంచి బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే సమక్షంలో ప్రారంభించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలతో సమీక్షించారు. ఈ సమావేశంలో డీబీసీడీవో రాజలింగు తదితరులు పాల్గొన్నారు.