BC విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త..

BC విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త*

దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తాం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం.

-10వేల మంది బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు సాయం..
10 వేల బీసీ కుటుంబాలకు భరోసా..

తమ బిడ్డలను పై చదువులు చదివించేందుకు వేరే రాష్ట్రాలకు పంపించేందుకు అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్న బీసీ కుటుంబాలు..

కేసీఆర్ బీసీ విద్యకు అదనంగా 150 కోట్లు కేటాయించడం BC బిడ్డల భవిష్యత్ వెలుగులకు పునాదులు అవుతాయింటున్న విద్యార్థులు..

పేద BC బిడ్డలు దేశవిదేశాల్లో ఎక్కడైనా చదువుకునేందుకు ఇప్పుడు వెనుకాడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది…

వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. మెరికల్లాంటి బిసి విధ్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాలు ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ వర్సీటీలు సహా 200కు పైగా ఇన్ట్సిట్యూట్లలో ప్రవేశం పొందిన వారికి సంపూర్ణంగా ఫీజులను (ఆర్టీఎఫ్) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు. ఈ మేరకు నేడు సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. గతంలో మన రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉండేదని ఈ విద్యా సంవత్సరం నుంచి బిసిలకు అందజేయాలని గౌరవ ముఖ్యమంత్రిగారి ఆదేశం మేరకు అమలు చేస్తున్నామన్నారు.

ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10వేల మంది బిసి విధ్యార్థులకు లబ్దీ చేకూరుతుందని, ఇందుకోసం అదనంగా ఏటా 150కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటికే అంతర్జాతీయంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బిసి విద్యార్థులకు అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్పులతో పాటు రాష్ట్రంలోనూ ఫీజు రియంబర్మెంట్ చెల్లిస్తున్నామని, ఇకనుండి దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లోని బిసి బిడ్డలకు సైతం పూర్తి ఫీజు అందించడంతో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బిసి విద్యార్థులకు పూర్తి ఫీజుల్ని చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదే అన్నారు మంత్రి గంగుల కమలాకర్..