*ఉప్పల్ స్టేడియం*
BCCI 117 కోట్లు కేటాయించినా మారని ఉప్పల్ క్రికెట్ స్టేడియం
పాడైన చైర్స్ లొనే కూర్చొని మ్యాచ్ చూసిన అభిమానులు
పాకిస్తాన్, ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ లో ప్రేక్షకుల ఇబ్బందులు
చైర్స్ ని క్లీన్ కూడా చేయించకుండానే.. ప్రేక్షకులను అనుమతించిన హెచ్ సీ ఏ
వరల్డ్ కప్ సందర్భంగా స్టేడియం రినోవేషన్ కోసం 117 కోట్లు కేటాయించిన బీసీసీఐ
కొన్ని కొత్త చైర్స్ వేయించి… మిగతా పాడైన చెయిర్స్ ని అలాగే ఉంచిన హెచ్ సీ ఏ..
ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి మహర్దశ పట్టనుంది. రూ. 117.17 కోట్లతో ఉప్పల్ స్టేడియం రూపురేఖలు మారనున్నాయి. భారత్ వేదికగా అక్టోబర్–నవంబర్ లో జరుగనున్న వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో రూ. 500 కోట్లతో దేశంలోని కనీసం ఐదు ప్రధాన స్టేడియాల్లో సౌకర్యాలను మెరుగు పరచాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో ఉప్పల్ స్టేడియం కూడా ఉంది. కొన్నేళ్లుగా హైదరాబాద్ స్టేడియం నిర్వహణను గాలికొదిలేశారు. సౌత్ స్టాండ్‌లోని పైకప్పు (కనోపి) నాలుగేళ్ల కిందట గాలివానకు ధ్వంసమైంది. ఈస్ట్, వెస్ట్ స్టాండ్స్ కు పైకప్పులు లేవు. దాంతో, మధ్యాహ్నం మ్యాచ్‌లకు హాజరయ్యే ప్రేక్షకులు ఎండకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని గమనించిన బీసీసీ ఇటీవల కొంత నిధులను కేటాయించడంతో ఆ నిధులతో ఉప్పల్ స్టేడియాన్ని బాగు చేయాలని కోరడంతో అది ప్రస్తుతం నిధులు మొత్తం పక్కదవ పట్టించారనే అభియోగాలు వ్యక్తం చేస్తున్నారు… నెట్ జనుల శోషల్ మీడియాలో సెటైర్లు వేసుకుంటున్నారు…