బీస్ట్‌ చిత్రంపై భారీ అంచనాలు….

యాక్షన్‌, కామెడీ నేపథ్యంలో సినిమా ఉంటుంది...

బీస్ట్‌ సినిమాలో దళపతి విజయ్.. వీర రాఘవ పాత్రలో రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు…

కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్‌, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’. ‘వరుణ్ డాక్ట‌ర్’ ఫేం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్‌ విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దళపతి ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. .సినిమా హీరో దళపతి విజయ్ వరుస సినిమా విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటీవల వచ్చిన విజయ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న బీస్ట్ తో బిజీగా ఉన్నారు. బీస్ట్ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.డాక్టర్’ ఫేం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్‌ విడుదల కానుంది.
తాజాగా బీస్ట్‌ చిత్ర బృందం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘మేము కూడా మీ లాగే బీస్ట్ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి విజయ్‌, పూజాహెగ్డేలతో పాటు పలువురు నటులు గోడచాటు నుంచి తొంగి చూస్తున్నట్లు ఉండే ఫోటోను జతచేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటికే విడుదలైన ‘అరబిక్ కుత్తూ’,‘జాల్లీ ఓ జింఖానా’ సాంగ్స్ హిట్ అయిన విషయం తెలిసిందే. అరబిక్ కుత్తూ పాట 24 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకోగా.. జాల్లీ ఓ జింఖానా సాంగ్ కూడా మూడున్నర కోట్లకు పైగా వ్యూస్‌ అందుకుంది. విజయ్ చివరగా నటించిన మాస్టర్, బిగిల్ సినిమాలు ఘన విజయాలు అందుకోవడంతో.. బీస్ట్‌ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సినిమా డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. సినిమాకు సంబంధించిన 7 ఆసక్తికర విషయాలు తెలియజేశారు.