ముఖం మీద నల్ల మచ్చలు తగ్గుతాయి…స్కిన్ గ్లో పెరుగుతుంది..!

ముఖ సౌందర్యం అనేది చర్మ సంరక్షణలో ఒక భాగమే అయినా ముఖానికి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజం చెప్పాలంటే చర్మ సంరక్షణలో ముఖానికె ప్రథమ స్థానం. ఎందుకంటే చాలా చర్మ సమస్యలు ముఖ భాగంలోనే వస్తాయి. అలాగే కనిపిస్తాయి కూడా. అందుకే ముఖాన్ని అందంగా, సురక్షితంగా ఉంచుకుంటే మంచిది. ముఖాన్ని అందంగా ఉంచకుండా చేసే విషయాల్లో ప్రధానమైనవి నల్లమచ్చలు. ఇవి చెంపలపై, ముక్కు మీద ఏర్పడి మెరిసే గుణాన్ని తగ్గిస్తాయి..ఎండలో తిరగడం ఇలాంటి సమస్యలు వస్తాయి..

మీ చర్మం మీద ఏర్పడ్డ అవాంఛిత డార్క్ స్పాట్స్ మరియు డార్క్ పాచెస్ ను సహజపద్దతిలో నివారించుకోవడానికి, అద్భుతమైన చర్మ సంరక్షణా చిట్కాలు, అద్భుతమైన హోం రెమడీస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏజ్ స్పాట్స్, లివర్ స్పాట్స్, సన్ స్పాట్స్, మెలస్మా, పిగ్మెంటేషన్ మరియు చర్మం యొక్క డార్క్ డిస్ కలరేషన్ తొలగించడానికి ఉల్లిపాయ, వెనిగర్, మరియు నిమ్మ జ్యూస్ బెస్ట్ హోం రెమడీస్ ఉన్నాయి.

నిమ్మరసం: మీరు ముఖం మీద బ్రౌన్ స్పాట్స్ (గోధుమ మచ్చలు) నివారణ కోసం నిమ్మరసం పరిహారంగా ఉపయోగించవచ్చు. ముఖం మీద బ్రౌన్ ఏజింగ్ స్పాట్స్ చికిత్సకు నిమ్మరసం హోంమేడ్ రెమడీస్ లో ఇది ఒకటి. ముఖంలో బ్రౌన్ స్పాట్స్ తొలగించడానకి కాటన్ బాల్స్ ను నిమ్మరసంలో ముంచి నల్ల మచ్చలున్న ప్రదేశలో మర్దన చేసి 15నిముషాలు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమడీ డార్క్ స్పాట్స్ ను వాడిపోయేలా చేస్తాయి మరియు బ్లాక్ స్కిన్ డిస్ కలరేషన్ ను సహజంగానే తేలిక చేస్తుంది.

టమోటా రసం: ఫేస్ బ్లెమ్ షెష్, డార్క్ డిస్ కలరేషన్, ఫ్రీక్లెస్, మరియు డార్క్ పిగ్మెంటేషన్ తగ్గించేందుకు నిమ్మరసం మరియు టమోటా రసం యొక్క మిశ్రమం కూడా ప్రతి రోజూ అప్లై చేసే ఒక గొప్ప హోం రెమడీ. ఇది ముఖం మీద డార్క్ స్పాట్స్ (గోధుమ మచ్చలు) వదిలించుకోవటం ఒక సమర్థవంతమైన పరిష్కారం మార్గం.