బెల్లంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతి…

మంచిర్యాల – బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు.

ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన సిబ్బంది వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.