కివీ పండుతోఎన్నో పోషక గుణాలు పుష్కలం…

కివీ పండును పళ్లలో రారాజుగా చెప్పొచ్చు. ఇదొక సాధారణ పండు కాదు. మిగిలిన పళ్లలో లేని ఎన్నో పోషక గుణాలు ఈ కివీ పండులో ఉన్నాయి. ఆ మధ్య దేశంలో డెంగీ ఉగ్రరూపం దాల్చినపుడు రోగులకు కివీ పళ్లు తినిపించమని ఎక్కువ మంది డాక్టర్లు సలహా ఇచ్చారు. కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవడానికి వీలుపడుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి….
కివీ పళ్ళు ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో జనం కివీ పళ్ళు ఆహారంలో బాగా తీసుకున్నారు. ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది….
అయితే ఈ కివీ పండు కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడమే కాదు.. ఇతర పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి ఇదొక దివ్య ఔషధం. ఈ కివీ పండును తినడం వల్ల కలిగే మరికొన్ని లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ ‘సి’ పుష్కలం
సాధారణంగా నిమ్మ, నారింజ పళ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ కివీలో నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివీ పండులో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పుష్కలం…

షుగర్ లెవెల్ తగ్గుముఖం..

రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.
రెండు కివీ పళ్ళను స్నాక్ గా తీసుకుంటే కడుపు నింపుతాయి. వీటిలో 58 కేలరీలే వుంటాయి. సాయంత్రం ఏదైనా తినాలని భావించేవారికి కివీ పళ్ళు చక్కని ఛాయిస్. కివీ పళ్ళు జీర్ణ క్రియకు బాగా సాయం చేస్తాయి, స్పష్టమైన, ఆరోగ్యకరమైన మేని ఛాయను కూడా ఇస్తాయి.గతంలో విదేశాల్లోనే ఇవి ఎక్కువగా లభించేవి. కానీ ఇప్పుడు ఎక్కడంటే అక్కడ దొరుకుతున్నాయి.
ముదురుగోధుమ రంగులో లేత ఆకుపచ్చ గుజ్జు కలిగి వుంటుంది. ఒకసారి తింటే పదే పదే తినాలని అనిపిస్తుంది. ఈ పండు పుల్లగా, తియ్యగా వుంటుంది. కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. కివీపండులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, విటమిన్ సి వుంటుంది. పిల్లల ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 8 నెలల వయసు నుంచే పిల్లలకు దీనిని తినిపించవచ్చు.
రోజూ రెండు కివీపళ్ళు తింటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా వుంటుంది. కొవ్వు తక్కువగా వుండడం వల్ల ఆకలి తగ్గిస్తుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా వుండడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్‌ ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. రొమాంటిక్ మూడ్ కూడా బాగా వుండేలా చేస్తుంది. కొత్తగా పెళ్ళయిన దంపతులు కివీ పళ్ళను బాగా తింటే మంచిది….