కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది…

బెంగళూరు:

కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఎక్స్‌ప్రెస్‌ రైలు కన్నూరు నుంచి బెంగళూరు వెళ్తున్నది.

బెంగళూరు డివిజన్‌లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్‌ మధ్య పర్వతంపై నుంచి బండరాళ్లు పట్టాలపై పడిపోయాయి.

దీంతో శుక్రవారం తెల్లవారుజామున 3.50 గంటల సమయంలో కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించారు. ప్రమాదం సంయమంలో రైలులో 2348 మంది ఉన్నారని చెప్పారు.