దేశంలో బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీ.!.

దేశంలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీకి తిరుగులేకుండా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తర్వాత ఎక్స్‌లో అత్యధిక మంది ఫాలోయింగ్ కలిగిన మూడో నేతగా ఉన్నారు..తాజాగా ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌నే ఎన్నుకున్నారు. 30 మంది సీఎంలలో ఆయన మొదటిస్థానంలో నిలిచారు. యోగికి 46.3 శాతం మంది బెస్ట్ సీఎం రేటింగ్ ఇచ్చారు. యోగి తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.

సొంత రాష్ట్రాల్లో సీఎంల పాపులారిటీలో 52.7 శాతం రేటింగ్‌తో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటిస్థానంలో ఉండగా.. 51.3 రేటింగ్‌తో రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.