భేతాళ కథలు…

*💦భేతాళ కథలు💦*

♦️పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, నువ్వు ఏ మహత్తర శక్తి కోరి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు. కాని కల్లబొల్లి శక్తులను నమ్మి నట్టయితే మహాబాహువు లాగే చివరకు మోసపోతావు. శ్రమ తెలియకుండా నీకు మహాబాహు వృత్తాంతం చెబుతాను విను.”అంటూ ఇలా చెప్పసాగాడు.

♦️పూర్వం గంగానదికి దక్షిణాన ప్రభావతి అనే నగరం ఉండేది. ఆ నగరంలో ఒక దేవి ఆలయం ఉండేది. ఆ దేవి గొప్ప మహిమలు గలది అనీ, భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రతీతి ఉండేది. అందుచేత ఆ దేవిని సందర్శించటానికి ఎక్కడెక్కడి నుంచో యాత్రికులు వచ్చేవారు. సాధారణంగా భక్తుల కోరికలు తీరుతూనే ఉండేవి. దేవి ఒకటి రెండు సందర్భాలలో పలికిందని కూడా చెప్పుకునేవారు. ఆమె మహిమ గురించి ప్రజలలో ఎలాటి విశ్వాసం వ్యాప్తి చెందిందంటే, ప్రభావతీ నగరాన్ని దేవి స్వయంగా కాపాడుతున్నది అని అనుకుని శత్రు రాజులు సైతం ఆ నగరం కేసి చూడటానికే భయపడుతూ వచ్చారు. ఈ కారణం చేత ప్రభావతీ నగరం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లింది.

♦️అటువంటి నగరానికి మహాబాహువు అనే గజదొంగ పొరుగుదేశం నుంచి పొరిపోయి వచ్చాడు. మహాబాహువు అత్యంత సాహసికుడు, హంతకుడు, అయితే అతనున్న రాజ్యం సంపన్నమయినది కాదు. అక్కడి రాజు అతన్ని విడవకుండా వేటాడి, అతడి ప్రాణం మీదికి తెచ్చాడు. ప్రభావతీ నగరం సంపన్నమైనది. అంతేగాక, అక్కడి రాజూ, ప్రజలూ చాలా సౌమ్యులని అతను విని ఉన్నాడు. ప్రభావతీ నగరంలోని దేవిని గురించి కూడా అతను విని ఉన్నాడు. ముందుగా ఆ దేవి అనుగ్రహం సంపాదించుకుని, ఆ తరవాత ప్రభావతీ నగరంలోనే తన దొంగవృత్తి కొనసాగించుకోవాలని మహాబాహు ఉద్దేశం.

♦️ఒక రోజు తెల్లవారగట్ట మహాబాహువు దేవి ఆలయాన్ని చేరుకున్నాడు. గుడి పూజారికి వేకువతోనే గుడికి రావటం అలవాటు. చేతిలో కత్తి పట్టుకుని భయంకరాకారుడెవరో గుడి వైపు వస్తూ ఉండటం చూసేసరికి పూజారికి పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. అతను చప్పున అమ్మ వారి విగ్రహం చాటున ఉన్న రహస్యపు ఆరలో దాక్కున్నాడు.

♦️మహాబాహువు గుడిలోకి ప్రవేశించి, అమ్మవారి విగ్రహం ముందు పొగిలబడి మొక్కి, “తల్లీ, జగజ్జననీ, నేను మహా బాహువును, నీ భక్తుణ్ణి. నా దేశాన్నీ, భార్యనూ వదిలిపెట్టి, నీ శరణుజొచ్చాను. నన్నెవరూ జయించకుండా వరమియ్యి.”అన్నాడు. మహాబాహువు అనే పేరు వినగానే పూజారి కాళ్ళు చల్లబడ్డాయి. అతను ఆ దుర్మార్గుణ్ణి గురించి చాలా విని ఉన్నాడు.

♦️మహాబాహువు కొంచెంసేపు చూసి, ” అంబా, పలకవేం ?” అని గర్జించాడు. కానీ అంబ పలకలేదు.

♦️”నువు పలుకుతావన్నారు. నీకు రక్తం కావాలా? ఇంద నా రక్తం తీసుకో!” అంటూ మహాబాహువు తన కత్తితో వేలు కోసుకుని, అమ్మవారి విగ్రహం ముందు బొటబొటా రక్తం కార్చాడు.

♦️అప్పటికీ దేవి పలక్కపోవటం చూసి ఆ దుర్మార్గుడు, ” అయితే నీలో మహత్తెమీ లేదా ? లోకాన్ని వంచిస్తున్నావా? నిన్ను ఈ క్షణమే నాశనం చేస్తాను,” అని ఉగ్రంగా అరిచాడు. వెంటనే అమ్మవారి నోట మాటలు వెలువడ్డాయి.

♦️”వత్సా తొందరపడకు. నీ భక్తికి మెచ్చాను. నిన్ను ఎవరూ జయించకుండా వరం ఇచ్చాను. యథేచ్ఛగా వెళ్ళు.”

♦️ఈ మాటలు అన్నది. పూజారే, అతను దాగిన అరతో ఒక గూడున్నది. ఆ గూటి నుంచి అమ్మవారి విగ్రహం అడుగుకుండా నోటి దాకా సన్నని బిలం ఉన్నది. అందుచేత పూజారి అన్న మాటలు అమ్మవారి నోటనే వెలువడ్డట్టు మహాబాహువుకు తోచింది. అదీ గాక గర్భగుడిలో మహా బాహువు తప్ప మరొక ప్రాణి ఉన్నట్టు లేదు. మహాబాహువు దేవికి మళ్ళి సాగిల పడి మొక్కి, ” ధన్యుణ్ణి తల్లీ! ధన్యుణ్ణి ! ధన్యుణ్ణి ! ” అనుకుంటూ వెళ్ళిపోయాడు.

🌻పూజారి ఈ వృత్తాంతం ఎవరికి చెప్ప లేదు. అయితే, మహాబాహువనే పరమ దుర్మార్గుడు ప్రభావతి నగరం వచ్చాడనీ, “తనను ఎవరూ జయించకుండా దేవివర మిచ్చిందనీ ఊరంతా పాకిపోయింది. ఎందుకంటే, తన సౌకర్యం కొరకూ, ప్రతిష్ఠ కొరకూ మహాబాహువే ఈ విషయాన్ని ప్రచారం చేసుకున్నాడు.

♦️అంబ తన పక్షాన ఉన్నదన్న ధైర్యంతో మహాబాహువు యథేచ్ఛగా దొంగతనాలు, దోపిడీలూ, హత్యలూ చెయ్యసాగాడు. దేవికి ప్రియభక్తుడన్న మూఢనమ్మకంతో ప్రజలు వాడి ఆటలు సాగనిచ్చారు. రాజుగారు మహాబాహువును వేటాడి రూపుమాపదలచినప్పుడు, మంత్రులు మొదలైన వారంతా ఏక కంఠంగా, అలాంటి పని కలలో కూడా అనుకోవద్దనీ, దేవికి ఆగ్రహం తెప్పించవద్దనీ, అజేయుడుగా దేవి నుంచి వరం పొందినవాడు ఎలాగూ మానవ ప్రయత్నాలకు లొంగడనీ రాజుకు సలహా ఇచ్చారు.

♦️ప్రభావతీనగరానికి ఈ మహాబాహువు బెడద తన మూలానే ఏర్పడిందని తెలిసిన పూజారి మానసికంగా చాలా వ్యధపడి పోయాడు. వాణ్ణి కడతేర్చే బాధ్యత తన పైన ఉన్నదని అనుకున్నాడు..

♦️మహాబాహువు దేవి ఆలయానికి వచ్చిన కొద్ది రోజుల అనంతరం ఒకనాటి తెల్లవారు ఝామున ఒక స్త్రీ, పొత్తిళ్ళలో ఒక బిడ్డను తీసుకుని వచ్చి, ఆ బిడ్డను గర్భగుడిలో అమ్మవారి దగ్గిర పెట్టి వెళ్ళిపోబోయింది. ఇది చూసిన పూజారి ఆమెను ఆపి, అమ్మా నువు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ బిడ్డ ఎవరు ? ” అని అడిగాడు.

♦️”అయ్యా, నేను మహాబాహువు భార్యను.. నా భర్త పారిపోయాక నాకు ఈ బిడ్డ కలిగాడు. నా భర్త చేసిన దౌర్జన్యకార్యాలకు ప్రజలు నా పైనా, నా బిడ్డ పైనా పగతీర్చుకుంటారు. అందుచేత ఈ బిడ్డను అక్కడ వదిలి, నా దారిన నేను ఎటైనా పోదామనుకున్నాను. మీరే నా బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకోండి.” అని చెప్పి ఆ స్త్రీ వెళ్ళిపోయింది.

♦️ఆమె వదిలిపోయిన బిడ్డను చూడగానే పూజారికి ఒక ఆలోచన వచ్చింది. అతను ఆ బిడ్డను తన ఇంటికి తీసుకుపోయి, దేవి స్వయంగా తన బిడ్డను ప్రసాదించిందని అందరితోనూ చెప్పి, ఆ బిడ్డకు దేవీదత్తుడని పేరు పెట్టి పెంచసాగాడు. కుర్రవాడికి బల పరాక్రమాలూ, కత్తిసాము, ఇతర క్షత్రియ విద్యలూ నేర్పించి, “నాయనా, దుష్ట సంహారం కోసమే దేవి నిన్ను నాకు ప్రసాదించింది. మహాబాహువు వంటి దుర్మార్గులను నిర్మూలించటానికే నువు జన్మ ఎత్తావు. అది దేవి ఆదేశం,” అని పూజారి దేవీ దత్తుడికి నూరిపోస్తూ వచ్చాడు.

♦️దేవీదత్తుడి చేతిలో మహాబాహువులాంటి దుర్జనులకు చావు రాసిపెట్టి ఉన్నదన్న సంగతి కూడా అంతటా వ్యాపించింది. ఈ మాట విని మహాబాహువు కూడా జంకాడు, ఎందుకంటే అతనికి దేవి మహిమలో అపార మైన విశ్వాసం ఉన్నది. ఆమె కృప వల్లనే తనను ఈ ప్రభావతీనగరంలో ఎవరూ ఏమీ చెయ్యలేకుండా ఉన్నారని అతనికి గట్టి నమ్మకం. అందుచేత మహాబాహువు దేవీ దత్తుణ్ణి తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు.

♦️దేవీదత్తుడు ఇరవైఏళ్ళవాడై ఉండగా ఒకనాడు రాజకుమార్తె పల్లకిలో ఎక్కి, సవరివారంగా దేవి ఆలయానికి పోతూండగా చూపి మహాబాహువు రాజకుమార్తె పైకి లంఘించాడు. రాజభటులు ఉండి కూడా మహాబాహువును ఎదిరించటానికి భయ పడ్డారు. ఆ సమయంలో కొంత దూరాన ఉన్న దేవీ దత్తుడు కత్తి దూసి పరిగెత్తుకుంటూ వచ్చి, మహాబాహువు మీద కలియబడ్డాడు. ఇద్దరికి హెూరా హెూరి యుద్ధం జరిగింది. తనను ఎదిరించినవాడు దేవీదత్తుడని తెలియగానే మహాబాహువు సగం చచ్చినట్టు అయిపోయాడు. దేవీదత్తుడు అతన్ని తేలికగా కడతేర్చాడు.

♦️మహాబాహువు మరణించాడనగానే నగరవాసులు ఉత్సవాలూ, వేడుకలూ జరిపారు. రాజుగారు దేవీదత్తుడి పరాక్రమానికి మెచ్చుకుని, అతనికి తన కుమార్తె నిచ్చి పెళ్ళిచేశాడు.

♦️బేతాళుడు ఈ కథ చెప్పి, ” రాజా, పూజారి ప్రవర్తన గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. అతను మహాబాహువు పొందిన వరం గురించి ప్రజలకు నిజం ఎందుకు చెప్పలేదు? చెబితే మహాబాహువును ప్రజలు ఏనాడో అవలీలగా చంపి ఉండక పోయారా? అదిగాక, ఆ మహాబాహువును చంపటానికి అతని కొడుకునే నియోగించి, పూజారి పితృహత్యకు ఎందుకు కారకు డయాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది,” అన్నాడు.

♦️దానికి విక్రమార్కుడు, “దేవి వల్ల దేశమూ, ప్రజలూ ఎంతో లాభం పొందుతున్నారు. దేవి మహత్తులో అందరికీ విశ్వాసం ఉండబట్టే ఆ నగరానికి శత్రు భయం కూడా లేదు. అలాంటప్పుడు, దేవి నోట వెలువడ్డ మాటలు తనవేనని పూజారి బయట పెట్టేస్తే ఇక దేవిలో ప్రపంచానికి గురి ఉండదు. అందువల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు. అందుకే పూజారి మహాబాహువుకు దేవి ఇచ్చిన వరం గురించి. నిజం దాచిపెట్టాడు. ఇక, మహాబాహువు లాంటి ప్రజాపీడకుణ్ణి ఎవరు చంపినా అది సత్కార్యమే అవుతుంది. అందుకు మహా బాహువు కొడుకే అనుకూలించటం కేవలమూ దైవికం, దానికి పూజారి బాధ్యుడు కాడు. పితృహత్య చేస్తున్నానన్న భావం కలిగితే దేవీదత్తుడికే కలగాలి. అయితే అతనికి మహాబాహువు తన తండ్రి అని తెలియనే తెలియదు. పూజారి పక్షం నుంచి చూస్తే అతడి మరణం దుష్టశిక్షణ అవుతుంది. కాని హత్య కానేకాదు.” అన్నాడు.

♦️రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.

🌼🌼🍒🍒🍒🌻🍒🍒🍒🌼🌼 విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, “రాజా, నువ్వు ఏ మహత్తర శక్తి కోరి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు. కాని కల్లబొల్లి శక్తులను నమ్మి నట్టయితే మహాబాహువు లాగే చివరకు మోసపోతావు. శ్రమ తెలియకుండా నీకు మహాబాహు వృత్తాంతం చెబుతాను విను.”అంటూ ఇలా చెప్పసాగాడు.

రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.