సెల్ఫీల సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను తీసింది…

సెల్ఫీల మోజులో పడి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సెల్ఫీల సరదా ఇద్దరు యువకుల ప్రాణాలను తీసింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
బేతుల్ జిల్లాలోని రైల్వే బ్రిడ్జిపై ఇద్దరు యువకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతలోనే ఓ రైలు వచ్చి వారిని ఢీకొట్టింది. ఇద్దరి యువకులు అక్కడిక్కడే మరణించారు. మచానా నదిపై ఉన్న రైల్వే వంతెనపై ఈ ఘటన జరిగినట్లు షాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి శివనారాయణ ముకాటి తెలిపారు.”ముఖేష్ ఉయికే(21), మనీల్ మార్స్కోల్ (19) శనివారం వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తమ ఇళ్ల నుండి బయలుదేరారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3గంటల సమయంలో రైల్వే వంతెనపై సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆ సమయంలో అటునుంచి వచ్చే భాగమతి రైలును యువకులు గమనించలేదు. వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఇద్దరు యువకులను ఢీకొట్టిందని ” అని మిస్టర్ ముకాటి చెప్పారు.