కర్ణాటక పాఠశాలల్లో కీలక ఘట్టం మొదలు…ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాల్లలో నైతిక విద్యలో భాగంగా ‘ భగవద్గీత’ను బోధించనున్నారు…!!

డిసెంబర్ నుంచి కర్ణాటక పాఠశాలల్లో కీలక ఘట్టం మొదలుకానుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాల్లలో నైతిక విద్యలో భాగంగా ‘ భగవద్గీత’ను బోధించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే భగద్గీత బోధిస్తే ఖురాన్ ను ఎందుకు బోధించరని ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఖురాన్ మతపరమైన గ్రంథమని.. భగవద్గీత మతపరమైన గ్రంథం కాదని.. కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ అన్నారు. భగవంతుని ఆరాధన గురించి భగవద్గీతలో ఉండదని.. మతపరమైన ఆచారాలను గురించి భగవద్గీత చెప్పదని.. కేవలం నైతికత గురించి మాత్రమే బోధిస్తుందని ఆయన అన్నారు. ఇది విద్యార్థులకు ప్రేరణ, స్ఫూర్తిని ఇస్తుందని ఆయన అన్నారు…