ఆషాఢ మాసంలో అద్భుతం…కాళ్లకు పారాణితో గుడిలో అడుగులు..!!!

ఆషాఢ మాసంలో అద్భుతం..

కాళ్లకు పారాణితో గుడిలో అడుగులు వేసిన అమ్మవారు ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు స్వయంగా అడుగులు వేస్తూ కదిలిన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి..

భారతదేశం సంస్కృతికి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. ముక్కోటి దేవతలు పూజలందుకుంటున్న పుణ్యభూమి. మన దేశంలో ఎన్నో అతి ప్రాచీన అద్భుత ఆలయాలు, ఆయా దేవతలకు ప్రత్యేకమైన పూజా విధానాలు కొనసాగుతుంటాయి. అంతేకాదు, మన దేశంలో దేవుళ్లను పూజించే భక్తులకు కూడా కొదువే లేదని చెప్పాలి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని వడోదరాలో ఓ అద్భుతం జరిగింది. ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు స్వయంగా అడుగులు వేస్తూ కదిలిన దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి…!!ఉదయాన్నే గుడి తలుపులు తెరిచిన పూజారి అమ్మవారి పాద ముద్రలు చూసి చుట్టు పక్కల జనాలకు వివరించారు. దాంతో జనం భారీగా గుమిగూడారు. స్వయంగా అమ్మవారే ఇక్కడ సంచరిస్తున్నారంటూ భక్తులు విశేష పూజలు చేస్తున్నారు. ఈ విషయం చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా దవానంలా వ్యాపించింది.