భారత మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్‌కు కేంద్రం భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న..

భారత మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్‌కు కేంద్రం భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు.చరణ్ సింగ్ భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయనను ‘భాతరదేశపు రైతుల విజేతగా’ పిలుస్తారు. చరణ్ సింగ్ 1902 లో ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ గ్రామంలో జన్మించారు. ఆయన భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండుసార్లు జైలుకి వెళ్లారు. చరణ్ సింగ్ 1946 లో గోవింద వల్లభ్ పంత్ మంత్రి వర్గంలో పార్లమెంటరీ కార్యదర్శిగా రెవెన్యూ, ఆరోగ్య, సాంఘిక, పరిశుభ్రత, న్యాయ, సమాచార శాఖలలో పనిచేశారు. 1951 లో కేబినెట్ మంత్రిగా న్యాయ, సమాచార శాఖ మంత్రిగా 1952 లో డా.సంపూర్ణానంద్ మంత్రివర్గంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు..63లలో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 1967 లో చరణ్ సింగ్ పార్టీని విడిచిపెట్టి ‘భారతీయ క్రాంతి దళ్ పార్టీ’ని స్ధాపించారు. 1967 లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1970 లో కాంగ్రెస్ మద్దతుతో ఉత్తరప్రదేశ్‌కు రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో చరణ్ సింగ్ అనేక భూసంస్కరణలు చేపట్టారు. 1960 లో లాండ్ హోల్డింగ్ చట్టాన్ని తీసుకుని వచ్చారు. మొరార్జీ దేశాయి ప్రధానిగా ఉన్న సమయంలో జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోం మంత్రిగా పనిచేశారు. 1979 నుండి 1980 వరకు దేశ ప్రధానిగా సేవలందించారు.

వ్యక్తిగత జీవితానికి వస్తే చరణ్ సింగ్ భార్య గాయత్రీ దేవి. ఆరుగురు పిల్లలు. 1987 మే 29న 84 సంవత్సరాల వయసులో చరణ్ సింగ్ కన్నుమూశారు. రైతు బంధుగా పేరు తెచ్చుకున్న చరణ్ సింగ్ సమాధిని ‘కిసాన్ ఘాట్’ అని పిలుస్తారు. ఆయన జన్మదినం డిసెంబర్ 23న ‘కిసాన్ దివస్’ (జాతీయ రైతు దినోత్సవం) జరుపుకుంటున్నాము.ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఉన్న అమృత్ సర్ విమానాశ్రయానికి ‘చౌధురి చరణ్ సింగ్ అంతర్జాతియ విమానాశ్రయం’గా నామకరణం చేసారు. చరణ్ సింగ్ రైతులకు సంబంధించిన అనేక రచనలు చేశారు. జీవితమంతా రైతుల హక్కులు, వారి సంక్షేమం కోసం పాటుపడిన చరణ్ సింగ్‌కు కేంద్రం తాజాగా దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించింది. ప్రధాని మోదీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది..