బీహార్లో ఘోర రైలు ప్రమాదం.. చెల్లాచెదురైన బోగీలు..

బీహార్లో ఘోర రైలు ప్రమాదం.. చెల్లాచెదురైన బోగీలు

బీహార్ లోని బక్సర్ సమీపంలో నిన్న రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లా చెదురయ్యాయి. మొత్తం 21 కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి గౌహతిలోని కామాఖ్య జంక్షన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది…

నలుగురు మృతి, 80 మందికి తీవ్ర గాయాలు..

ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే స్పందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. గాయపడిన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆయన తెలిపారు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి తాను విపత్తు నిర్వహణ శాఖ, ఆరోగ్య శాఖ, బక్సర్, భోజ్‌పూర్ జిల్లా అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. రఘునాథ్‌పూర్‌లో రైలు పట్టాలు తప్పిన ఘటనను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కార్యాలయం పేర్కొంది. బక్సర్‌లోని జిల్లా అధికారులతో, ఇతర ఏజెన్సీలతో తాము టచ్‌లో ఉన్నామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇక రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది..