భీమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్ల..!

స్టార్ గోపిచంద్ హీరోగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన చిత్రం భీమా. ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వీకే నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి 8వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పురాణాల్లో పరుశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండటంతో గోపిచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే థియేటర్‌లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో కలెక్షన్లు రాబడుతుందనే ఆసక్తి పెరిగింది.భీమా సినిమా పాజిటివ్ ఓపెన్సింగ్స్ బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఈ చిత్రానికి 40 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్‌లో 40 శాతం, విజయవాడలో 30 శాతం, వరంగల్‌లో 55 శాతం, గుంటూరు, వైజాగ్‌లో 35 శాతం, కరీంనగర్‌లో 55 శాతం, మహబూబ్ నగర్‌లో 50 శాతం, కాకినాడలో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక ఓవర్సీస్‌లో గోపిచంద్ మూవీకి మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంది. ఈ సినిమా యూఎస్ఏ, ఇతర ప్రాంతాల్లో కలిపి 1.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఏపీ, తెలంగాణలో కలిపి ఈ చిత్రం 2.35 కోట్లు నికరంగా కలెక్ట్ చేస్తుందని పేర్కొన్నారు. కర్ణాటక ఇతర ప్రాంతాలల్లో కలిపి మొత్తంగా ఈ సినిమా తొలి రోజు 3.5 కోట్లు నికరంగా, 4.5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అవకాశం ఉంది. గతంలో వచ్చిన రామబాణం చిత్రం డే 1 రోజున 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక రెండో రోజు కూడా భీమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని తెలిపారు. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 6 కోట్లకుపైగా కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు..