బిచ్చగాడు 3′ సినిమాను కూడా పట్టాలెక్కించాలనే ఆలోచనలో విజయ్ ఆంటోని..

బిచ్చగాడు’ అనే ఒక టైటిల్ పెట్టడమే సాహసంతో కూడుకున్న పని. ఆ టైటిల్ తో రెండు సార్లు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం విజయ్ ఆంటోని ప్రత్యేకత. ఆయన నుంచి వచ్చిన ‘బిచ్చగాడు 2’ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ‘బిచ్చగాడు’ సినిమాలో తల్లి సెంటిమెంట్ ఎంత బలాన్ని ఇచ్చిందో, ఈ సినిమాకి చెల్లి సెంటిమెంట్ అంతగా కలిసొచ్చింది. తమిళ .. తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. దాదాపు ఈ సినిమా లాభాల బాట పట్టినట్టేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘బిచ్చగాడు 3’ సినిమాను కూడా పట్టాలెక్కించాలనే ఆలోచనలో విజయ్ ఆంటోని ఉన్నాడని అంటున్నారు. ఎందుకంటే ‘బిచ్చగాడు’ తరువాత మళ్లీ ఆయనకి హిట్ ఇచ్చిన సినిమా ఇదే ఈ నేపథ్యంలోనే ‘బిచ్చగాడు 3’ సినిమాను కూడా పట్టాలెక్కించాలనే ఆలోచనలో విజయ్ ఆంటోని ఉన్నాడని అంటున్నారు. ఎందుకంటే ‘బిచ్చగాడు’ తరువాత మళ్లీ ఆయనకి హిట్ ఇచ్చిన సినిమా ఇదే.

ఈ సినిమాలో హీరో తన బాల్యం నుంచి బిచ్చగాడుగానే ఉంటూ వస్తాడు. అలాంటి అతనికి లక్షకోట్ల ఆస్తులను అనుభవించే అవకాశం వస్తుంది. కానీ అతను బిచ్చగాళ్లతోనే ఉండటానికి ఇష్టపడతాడు. లక్ష కోట్లను అలా వదిలేస్తే ఆ డబ్బు స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోతుందని భావించి, పేదవాళ్లందరిని ఉద్ధరించడానికి రంగంలోకి దిగుతాడు. ఎమోషన్స్ తో కూడిన ఈ కంటెంట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.