బిగ్ బాస్ సందడి మొదలుకానుంది…

బిగ్ బాస్ సందడి మొదలుకానుంది. ఇప్పటి వరకూ వచ్చిన ఐదు సీజన్లు రోజుకి గంట మాత్రమే ప్రసారమవ్వగా.. రేపట్నుంచి ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్ 6 ఓటీటీ 24 గంటలు ప్రసారం కానుంది. ఈ రియాలిటీ షో రేపే గ్రాండ్ ఓపెనింగ్ అవ్వనున్న నేపథ్యంలో మరో ప్రోమోను వదిలారు మేకర్స్. ఈ ప్రోమోతో నాగార్జునే హోస్ట్ అని చెప్పకనే చెప్పేశారు. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ ప్రోమోలో చూపించిన హౌస్.. సరికొత్త హంగులతో సిద్ధమైనట్లు కనిపిస్తోంది. గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ తొలి సీజన్ సిద్ధమవుతోంది….ఎంటర్‌టైన్‌మెంట్‌ బాప్‌గా నిలిచిన ఈ షో ఇప్పుడు 24/7 వినోదం పంచేందుకు రెడీ అయింది. ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు…