బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌ పేరుతో మోసం..

*హైద్రాబాద్..*

*జూబ్లీహిల్స్ పీఎస్..*

బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌ పేరుతో మోసం..

బిగ్ బాస్‌ సిసన్ 7కి పంపిస్తానని 2.75 లక్షలు తీసుకుని తనను తమ్మలి రాజు అనే వ్యక్తి మోసం చేశారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అంకర్ & నటి స్వప్న చౌదరి ఫిర్యాదు..

తనను బిగ్‌ బాస్‌–7లోకి పంపిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ అమ్మినేని స్వప్న అనే యాంకర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు… ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్‌ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా టాలీవుడ్‌లో పని చేస్తున్నారు.
మా టీవీలో ప్రొడక్షన్‌ ఇన్చార్జిగా పనిచేస్తున్న సత్య బిగ్‌బాస్‌ ఇన్‌చార్జి తమిలి రాజును పరిచయం చేశారు. బిగ్‌ బాస్‌ లోకి వెళ్లడానికి అందులో ఉపయోగించే దుస్తులు ప్రచారం కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తమిలి రాజు ఆమెకు సూచించారు. ఈ మేరకు గత ఏడాది జూన్‌ నుంచి దాదాపు రెండున్నర లక్షలు ఆమె అతనికి చెల్లించింది. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు ఆమెను నమ్మించాడు.

ఇందుకు సంబంధించి తమిలి రాజు ఆమెకు ఒక అగ్రిమెంట్‌ కూడా రాసిచ్చాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో కొద్దిరోజుల క్రిందట స్వప్న వీడియో రూపొందించి సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేసింది. ఇదే సంఘటనపై శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్‌ 406, 420 కింద రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .

ఆధారాలతో సహా జూబ్లీహిల్స్ పిఎస్ లో తమ్మాలి రాజు పై నటి స్వప్న చౌదరి ఫిర్యాదు..

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న జుభ్లెహిల్స్ పోలీసులు

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ . క్యాస్ట్యూమ్స్‌కి.. పీఆర్ టీంల కోసం నటి స్వప్న నుండి 2.75 లక్షల నగదు వసూలు చేసిన తమ్మలీ రాజు

బాండ్ పేపర్‌పై నటి స్వప్న కు అగ్రిమెంట్ చేసి ఇచ్చిన తమ్మాలీ రాజు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయిపోయింది. అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వని తమ్మల్లి రాజు.

తమ్మల్లి రాజు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నటి స్వప్న చౌదరి ఫిర్యాదు.