బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సభలో బాంబు కలకలం..

బీహార్ సీఎం నితీష్ కుమార్ పై బాంబు దాడి..!

R9TELUGUNEWS.COM.బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై మంగళవారం బాంబు దాడి జరిగింది. నలందలో ఆయన పాల్గొన్న జనసభపై ఓ దుండగుడు బాంబు విసిరాడు. ఈ ఘటనతో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే..

వేదికకు పదిహేను నుంచి 18 అడుగుల దూరంలో బాంబు కిందపడి పేలుడు ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ఎవరికీ ఏం కాలేదని సమాచారం. నలంద సిలావో గాంధీ హైస్కూల్‌ దగ్గర ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. పాట్నా భక్తియార్‌పూర్‌లో ఈ మధ్యే బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. మానసిక స్థితి సరిగా లేని స్థానిక నివాసిగా భావిస్తున్న దుండగుడిని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు