బీహార్‌ విచిత్రమైన ఘటన, పరీక్ష రాసేందుకు వెళ్ళి అమ్మాయిలను చూసి స్పృహ కోల్పోయిన విద్యార్థి..!!

పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని నలందా జిల్లాలో చోటు చేసుకుంది. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. మనీశ్‌ శంకర్‌(17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. మనీశ్‌ను పరీక్ష రాసేందుకు అతడి తండ్రి సచ్చిదానంద్‌ ప్రసాద్‌ సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్‌ కాన్వెంట్‌ స్కూల్‌కు తీసుకొచ్చాడు. అయితే.. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్​లోకి వెళ్లాడు.అక్కడ అంతా అమ్మాయిలు ఉండేసరికి.. ఆశ్చర్యపోయాడు. పరీక్షా కేంద్రంలో 500 మందికి పైగా బాలికలు ఉండగా.. అబ్బాయి మాత్రం మనీశ్‌ ఒకడే. అతని చూసి అమ్మాయిలంతా ఒక్కసారిగా ఘోల్లుమనడంతో.. అర్థంకాని అయోమయంలో ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోయాడు మనీశ్​. దీంతో అతన్ని సర్దార్‌ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు పరీక్షా నిర్వాహకులు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు.