మద్యం సేవించే వారు “మహాపాపి.. అంటు సంచలన వ్యాఖ్యలు చేసిన నితీష్‌ కుమార్….

బీహార్‌లో కూడా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు.. ఇదే సమయంలో.. కల్తీ మద్యం తాగి మృతిచెందేవారి సంఖ్య కూడా పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం నితీష్‌ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మ‌ద్యం సేవించే వారంద‌రూ మ‌హా పాపుల‌ని అభివ‌ర్ణించిన ఆయన.. వారిని భార‌తీయులుగా తాను భావించ‌న‌ని పేర్కొన్నారు..మద్యం సేవించే వారిని “మహాపాపి” అని పేర్కొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. మహాత్మా గాంధీ ఆశయాలను పాటించని ఎవరైనా భారతీయుడే కాదని వ్యాఖ్యానించారు.. ఎవరైనా బాపు ఆదర్శాలను విశ్వసించకపోతే, వారిని భారతీయులుగా కూడా పరిగణించమని.. వారు జాతిపిత మాట కూడా వినని అసమర్థులు, మహాపాపులు అంటూ బీహార్ అసెంబ్లీ సమావేశాల్లో వ్యాఖ్యానించారు.. ప్రపంచవ్యాప్తంగా మద్యం ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో ప్రజలకు అవగాహన కల్పించాలని నితీశ్ కుమార్ తెలిపారు.. మద్యపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడారు నితీష్‌ కుమార్.. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.