భీమ్లా నాయక్’ రెండో ట్రైలర్‌ విడుదల..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన ‘భీమ్లా నాయక్’ రెండో ట్రైలర్‌ను చిత్ర బృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేసింది. మొదటి ట్రైలర్‌ను మించే రేంజ్‌లో మాస్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. మొదటి ట్రైలర్‌పై మిశ్రమ స్పందన రావడంతో రెండో ట్రైలర్‌ను బృందం విడుదల చేసినట్లు ఉంది. భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పవర్ స్ట్రోమ్ కు రెడీగా ఉండాలని ముందే చెప్పిన చిత్రయూనిట్.. అదే రేంజ్ లో ట్రైలర్ ను కట్ చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. భీమ్లానాయక్ వర్సెస్ డానియల్ శేఖర్… ఎవరికివారు అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఈగోల్ని కాపాడుకుంటూ సాగే కథను కనెక్టివిటీ కట్టవకుండా డిజైన్ చేశారు డైరెక్టర్. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. భీమ్లా నాయక్ రెండవ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి ట్రైలర్ లో లేని కొన్ని సన్నివేశాలను ఈ ట్రైలర్ లో యాడ్ చేశారు. మొత్తంగా ఈ ట్రైలర్ కూడా సినిమా పై అంచనాలను పెంచేసింది. డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట చిత్రం అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.