భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్ రావత్‌ మృతి….. వారి మృతి పట్ల పలువురు సంతాపం..

R9TELUGUNEWS.COM..
భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంలో
బిపిన్ రావత్‌ మృతి…
త‌మిళ‌నాడు కూనురు నీలగిరికొండ‌ల్లో ఆర్మీ హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ప్రమాణిస్తున్నారు. వీరిలో ఇప్పటికే 12 మంది మృత్యువాత పడగా.. ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్‌ రావత్‌ సైతం కన్నుమూశారు.
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రావత్‌ మృత్యువుతో చివరి వరకు పోరాడి తుదిశ్వాస విడిచారు. రావత్‌తోపాటు ఆయన భార్య మధులిక కూడ చనిపోయారు..ఇవాళ ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సీడీఎస్ బిపిన్‌ రావత్‌ పాటు ఆయన భార్య మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారులు తమిళనాడు వచ్చారు. ఈ ప్రత్యేక విమానం ఉదయం 11.35 గంటలకు సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఇక సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన వారంతా ఎంఐ-17వీఎఫ్‌ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయల్దేరారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీస్‌ కాలేజీలో .. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ లెక్చర్‌ ఇచ్చేందుకుగానూ ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అయితే మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని నంచప్ప చత్రం ప్రాంతంలో ఒక్కసారిగా బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా కూలిపోయింది…

హెలికాప్టర్ ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని భారతమాత వీరులను కోల్పోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య , ఇతర సాయుధ దళాల సిబ్బందిని కోల్పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. వారు భారతదేశానికి అత్యంత శ్రద్ధతో సేవ చేశారు. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. భారతదేశపు మొదటి CDSగా, జనరల్ రావత్ రక్షణ సంస్కరణలతో సహా మన సాయుధ దళాలకు సంబంధించిన విభిన్న అంశాలపై పనిచేశారు. అతను తనతో పాటు ఆర్మీలో పనిచేసిన గొప్ప అనుభవాన్ని తెచ్చుకున్నారు. ఆయన చేసిన విశేష సేవలను భారతదేశం ఎన్నటికీ మరువదు. జనరల్ బిపిన్ రావత్ అద్భుతమైన సైనికుడు. నిజమైన దేశభక్తుడు..

ప్రముఖుల నివాళులు..

బిపిన్ రావత్ మరణం పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా జీ అకాల మరణం పట్ల నేను దిగ్భ్రాంతి చెందాను, తీవ్ర వేదనకు గురయ్యాను. దేశం తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. మాతృభూమికి అతని నాలుగు దశాబ్దాల నిస్వార్థ సేవ అసాధారణమైన శౌర్యం, వీరత్వంతో దేశం గుర్తించుకుంటుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు…

CDS, జనరల్ బిపిన్ రావత్ జీని చాలా విషాదకరమైన ప్రమాదంలో కోల్పోయిన దేశానికి చాలా విచారకరమైన రోజు. మాతృభూమికి అత్యంత భక్తిశ్రద్ధలతో సేవ చేసిన వీర సైనికుల్లో ఆయన ఒకరు. అతని ఆదర్శప్రాయమైన సహకారం, నిబద్ధత మాటల్లో చెప్పలేము. నేను తీవ్రంగా బాధపడ్డాను.అంటూ హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు…

ప్రమాదంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది సాయుధ బలగాల ఆకస్మిక మరణం తీవ్ర వేదనకు గురిచేసింది అన్నారు. ఆయన అకాల మరణం మన సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటు. జనరల్ రావత్ అసాధారణమైన ధైర్యం, శ్రద్ధతో దేశానికి సేవ చేశారు. మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రావత్ మన సాయుధ దళాల ఉమ్మడి ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు రక్షణ శాఖ మంత్రి…
———-
జనరల్ బిపిన్ రావత్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు.

హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ రక్షణ రంగానికి బిపిన్ రావత్ చేసిన సేవలను సీఎం కేసిఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు…