బిపిన్‌ రావత్‌ని కించపరిచేవారిని వదిలేది లేదు… కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర..

రావత్‌ని కించపరిచేవారిని వెంటాడి పట్టుకోండి!..

డీజీపీకి కర్ణాటక హోంమంత్రి ఆదేశం.

R9TELUGUNEWS.COM.ఇటీవల ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ని కించపరిచేవారిని వదిలేదని లేదని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో రావత్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డీజీపీ ప్రవీణ్‌ సూదన్‌ని ఆదేశించారు. డిసెంబర్‌ 8న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులికా రావత్‌ కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. దేశం గర్వించే బిపిన్‌ రావత్‌ త్యాగాల్ని అవహేళన చేసేలా తప్పుడు పోస్టులు పెడుతున్న వికృత మనస్కులను గుర్తించి కఠినంగా శిక్షంచాలని డీజీపీని హోంమంత్రి ఆదేశించారు. వారు సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన పోస్టుల ఆధారంగా అడ్రస్‌లను గుర్తించి.. వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.