తరుముకొస్తున్న బిపోర్‌జాయ్‌.. ఆలయాలు, ఆఫీసులు మూసివేత..!

*అహ్మదాబాద్‌. బిపోర్‌ జాయ్‌ తుపాను ముంచుకొస్తోంది. అత్యంత భీకరంగా మారిన బిపోర్ జాయ్ గురువారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత తీరాన్ని దాటనుంది..

కచ్‌ సమీపంలోని మాండ్వి-పాక్‌లోని జఖౌ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ (IMD)వెల్లడించింది. తుపాను తీరం దాటేవేళ గంటకు 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయని హెచ్చరించింది. దాంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో సాయంత్రం వరకు సముద్రం కల్లోలంగా ఉండనుంది..

అరేబియా సముద్రం(Arabian Sea)లో ఏర్పడిన వాటిలో ఎక్కువ కాలం కొనసాగనున్న తుపానుగా బిపోర్‌జాయ్‌ నిలవనుంది. జూన్‌ ఆరు ఇది ఏర్పడింది. తీరాన్ని తాకిన తర్వాత కూడా ఇది మరికొన్ని రోజులు ఉనికిలో ఉంటుంది. ఇక తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్‌లో అమల్లో ఉంచారు. ఆలయాలు, కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు..