అత్యంత పురాతన బీర్‌ ఫ్యాక్టరీ బయటపడింది………..

ఈజిప్టు దేశంలోని పురావస్తు శాఖకు చెందిన ప్రదేశంలో అత్యంత పురాతన బీర్‌ ఫ్యాక్టరీ బయటపడింది. అమెరికా-ఈజిప్టు‌ పురావస్తు శాఖల‌ శాస్త్రవేత్తలు సంయుక్తంగా చేపట్టిన పరిశోధనలో ఈ ఫ్యాక్టరీ వెలుగుచూసింది. తాజాగా ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈజిప్టు రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలోగ‌ల‌ ఎబిడాస్ ప‌ట్ట‌ణంలో నైలు నదికి పశ్చిమంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో ఈ బీర్‌ ఫ్యాక్టరీని కనుగొన్నారు. తాజాగా వెలుగుచూసిన ఆ బీర్‌ ఫ్యాక్టరీ నర్మర్‌ చక్రవర్తి కాలానికి చెందినదిగా పరిశోధ‌కుడు గుర్తించారు. ఫ్యాక్టరీలో మొత్తం 8 యూనిట్‌లు ఉండ‌గా, వాటిలో ఒక్కో యూనిట్‌ ఇరవై మీటర్లు పొడవు, 2.5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఒక్కో యూనిట్‌లో దాదాపు 40 కుండలు రెండు వరుసలుగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కుండలలో బీర్‌ తయారు చేయటానికి అవసరమైన పదార్థాలను వేసి మరిగించేవార‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. దేశ రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలో ఎబిడాస్‌లో.. నైలు నదికి పశ్చిమంగా ఉన్న ఓ శ్మశాన వాటికలో ఈ ఫ్యాక్టరీని కనుగొన్నారు. ఆ బీర్‌ ఫ్యాక్టరీ నర్మర్‌ చక్రవర్తి కాలానికి చెందిన గుర్తించారు. ఫ్యాక్టరీలో మొత్తం 8 యూనిట్లు.. ఒక్కో యూనిట్‌ ఇరవై మీటర్లు పొడవుతో, 2.5 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి.