చికెన్ ధర ఒక్కసారిగా కిందకు పడిపోయింది.

కరోనా సమయంలో భారీగా పెరిగిన ధరలు, బర్డ్ ఫ్లూ దెబ్బకు పడిపోయాయి..

కోడి మాసం ధరలు 50 శాతం తగ్గినా కొనేందుకు జంకుతున్నారు. గత పది రోజులుగా పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలు ఘననీయంగా పడిపోయాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూతో పక్షులు, కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు రావడం, దీనిపై బాగా ప్రచారం జరగుతుండడంతో చికెన్‌ ప్రియులు భయపడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు….అనేక రాష్ట్రాల్లో చికెన్ ధర ఒక్కసారిగా కిందకు పడిపోయింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్లు అమ్మకాలు భారీగా పడిపోయాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ధరలు నేలకు దిగివచ్చాయి. కరోనా సమయంలో భారీగా పెరిగిన ధరలు, బర్డ్ ఫ్లూ దెబ్బకు పడిపోయాయి. మహారాష్ట్రలో కేజీ చికెన్ ధర రూ.58 ఉంటె, గుజరాత్ లో కేజీ చికెన్ ధర రూ.65 ఉంది. ఇక తమిళనాడులో కేజీ చికెన్ ధర రూ.70గా ఉన్నది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు ధరలు, అమ్మకాలు పడిపోతుంటే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధరలు నిలకడగా ఉండటం విశేషం. మరోవైపు, చికెన్ షాపులు వెలవెలబోతుంటే.. చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. సాధారణంగా కొర్రమీను కిలో గతంలో రూ. 400- 450 మధ్య విక్రయించగా.. ప్రస్తుతం ఇది రూ.500-600గా ఉంది. రొయ్యలు కిలో రూ.400, బొచ్చ చేప రూ. 120-140, రవ్వ చేప రూ. 130-150 వరకు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ చేపల విక్రయాలు పెరిగాయి. ఫ్రెష్‌ టు హోమ్‌, బిగ్‌బాస్కెట్‌, లిసియస్‌ తదితర యాప్‌లపై చికెన్‌ కన్నా చేపలకే డెలివరీలు ఎక్కువగా ఉన్నాయని పలువురు డెలివరీ బాయ్స్‌ తెలిపారు.