నేటి నుంచి భద్రాచలంలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు…

నేటి నుంచి భద్రాచలంలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 16 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 10న శ్రీసీతారామ కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం ఏప్రిల్ 11న శ్రీరామ మహపట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.