తెలంగాణ రాష్ట్ర బిజెపి కొత్త అధ్యక్షులుగా కిషన్ రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర బిజెపి కొత్త అధ్యక్షులుగా కిషన్ రెడ్డి ..

తెలంగాణ బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్..

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి

ఝార్ఖండ్ బిజెపి అధ్యక్షుడిగా బాబూలాల్ మారండి..
బిజెపి పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జాకర్
రాజస్థాన్ బిజెపి అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షేకవత్..
బిజెపి జాతీయ కార్యవర్గ కమిటీలోకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి…

తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం సంజయ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి నియమితులయ్యారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు కూడా కీలక పదవి దక్కింది. ఆయన్ను తెలంగాణ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారు..

ఈటలకు సముచిత స్థానం..
ఇక బీజేపీలో గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఈటల రాజేందర్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక పదవిని కట్టబెట్టింది. అందరూ ఉహించనట్లుగానే తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. పార్టీ అధ్యక్ష పదవికి సరిసమానమైన.. ఈ బాధ్యతకు ఆయనే సరైన వ్యక్తని పార్టీ భావించింది. ఈటలకు ఉన్న మాస్ ఇమేజ్‌కు తోడు బీసీ నేతగా గుర్తింపు, ఉద్యమ నేతగా ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధం పార్టీకి కలిసొస్తుందని అదిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..