తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఉపిస్తున్నరు..ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాటసింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. అయితే, ఆ వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ పరిశీలనకు వెళ్లకుండా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారిద్దరూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు..ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా బాటసింగారానికి బయల్దేరారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇతర బీజేపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే వారి వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో కిషన్ రెడ్డి, రఘునందన్, ఇతర నేతలు భారీ వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి అయిన తన వాహనాన్ని అడ్డుకుంటారా? అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి వచ్చినా కిషన్ రెడ్డి…బాట సింగారానికి వెళ్తానని పట్టుబట్టారు.
డబుల్ బెడ్రూం ఇళ్లపై బీఆర్‌ఎస్,బీజేపీ మధ్య ఫైట్ నడుస్తోంది. ఇళ్లను పరిశీలించేందుకు బాటసింగారం వెళ్తుండగా కిషన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు పరిధి దాటగానే అడ్డుకున్నారు పోలీసులు. కిషన్ రెడ్డిని అడ్డుకోవడంపై అటు బీజేపీ కార్యకర్తల ఆగ్రహం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు కిషన్ రెడ్డ,రఘునందన్, రామచంద్రారెడ్డి. పోలీసుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎక్కడికైనా వెళ్లే హక్కుఉందని, తనను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కాన్వాయ్‌నే అడ్డుకుంటారా అంటూ తీవ్ర స్వరంతో అన్నారు. తాను ఏమైనా ఉగ్రవాదినా అంటూ పోలీసులను ప్రశ్నించారు. కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోవాలని,తామంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని అన్నారు కిషన్ రెడ్డి. ఇది కల్వకుంట్ల రాజ్యమా.. పోలీసుల రాజ్యమా అంటూ నినాదాలు చేశారు..