బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించిన..తరుణ్‌ చుగ్.

హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మొదట మహిళా మోర్చా నేతలను బాగున్నారా అంటూ తెలుగులో పలకరించారు.. ఇక, బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించిన ఆయన.. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కారావు.. అభివృద్ధి కోసం చేసిందేమి లేదు.. ఉద్యమంలోనూ చేసిందేమిలేదన్నారు. ఫాం హౌజ్ లో కూర్చోవడం తప్పా.. ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశావు అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించిన తరుణ్‌ చుగ్.. తెలంగాణ ప్రజల ఆశలు నేరవేర్చలేకపోయారని మండిపడ్డారు.. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చావు.. మద్యం నిషేధిస్తానని ముఖ్యమంత్రి సీట్లో కూర్చిని మాట మార్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అందుకే మహిళలు ఇంటింటికి వెళ్ళి కేసీఆర్ వైఫల్యాలను వివరించాలన్నారు.. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇక, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన.. దేశంలో పేదల జీవితంలో మార్పుకోసం మోడీ అనేక పథకాలు తీసుకువచ్చారని వివరించారు. మహిళలు, అమ్మాయిల రక్షణ.. అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రధాని మోడీ తీసుకువచ్చారని.. పూర్తిస్థాయి మహిళా కమిషన్ ఏర్పాటు చేశారని.. నారీ పోర్టల్ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకుని వచ్చారని తెలిపారు. తెలంగాణలో అవినీతి పాలనను పారద్రోలేందుకు తెలంగాణ మహిళా మోర్చా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు తరుణ్‌ చు